తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది: ఎంపీ వినోద్ కుమార్

byసూర్య | Tue, Jan 22, 2019, 01:59 PM

హైదరాబాద్: ఉమ్మడి పాలనలో జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జాతీయ రహదారులు సాధించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. 1,385 కి.మీ జాతీయ రహదారులుగా ప్రకటించారు. 3,155 కి.మీ మేర 25 రాష్ట్ర రహదారులను హైవేలుగా మారుస్తూ అంగీకరించారు.  తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుసార్లు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించినా కేంద్రం గెజిట్ విడుదల చేయడం లేదు. పనులు చేయకుండా కేంద్రం కుంటి సాకులు చెప్తుందని విమర్శించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM