ఇండోనేషియాలో భూకంపం

byసూర్య | Tue, Jan 22, 2019, 10:49 AM

జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1‌గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుంబా ద్వీపానికి సమీపంలో వైంగపు నగరానికి 150కిలోమీటర్ల దూరంలో 31కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  ఈ ప్రకంపనల అనంతరం 5.2‌ తీవ్రతతో మరోసారి ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా విపత్తు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. గత డిసెంబరులో అగ్నిపర్వతం బద్దలై భారీ సునామీ సంభవించింది. 400మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత సెప్టెంబరులో సులవెసి ద్వీపంలోని పలు నగరంలో సంభవించిన భారీ సునామీ కారణంగా 2,200మంది మృత్యువాతపడ్డారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM