ముగిసిన తొలి విడుత పోలింగ్

byసూర్య | Mon, Jan 21, 2019, 01:58 PM

హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. 3,701 పంచాయతీల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఒంటి గంట వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడుతలో భాగంగా 4,479 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 769 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగతా పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 26 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM