సహస్ర చండీ మహాయాగం ప్రారంభం

byసూర్య | Mon, Jan 21, 2019, 12:56 PM

సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహస్ర చండీ మహాయాగాన్ని ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో యాగాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, సహప్ర చండీ యాగం, రాజ శ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్ర మహాయాగం నిర్వహించనున్నారు. యాగంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహముద్ అలీ, కేటీఆర్ దంపతులు, హరీశ్ రావు దంపతులు, ఎంపీలు కవిత, లక్ష్మీకాంతారావు, కేశవరావు దంపతులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాయాగ క్రతువులు శృంగేరీపీఠం సాంప్రదాయాల ప్రకారం జరగనున్నాయి. ఈ యాగాల్లో 300 మంది రుత్వికులు పాల్గొంటున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM