పరారీలోని ఆర్థిక నేరస్థులందరినీ భారత్‌ తీసుకొస్తాం : రాజ్‌నాథ్‌

byసూర్య | Mon, Jan 21, 2019, 12:54 PM

బ్యాంకులను కోట్లాది రూపాయిల మేరకు మోసగించి విదేశాలకు పరారైన నేరస్థులందరినీ భారత్‌కు తీసుకు వచ్చి విచారణ జరుపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సి తన భారత పౌరసత్వం వదులుకోవడంపై రాజ్‌నాథ్‌ స్పందించారు. తమ ప్రభుత్వం పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును ఆమోదించిందని ఆయన చెప్పారు. పరారీలో ఉన్నవారినందరినీ తీసుకు వస్తామని ఆయన చెప్పారు. అయితే ఇది కొంత సమయం పట్టవచ్చునని ఆయన అన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్ల రూపాయిలు మోసగించి పరారైన మెహుల్‌ చోక్సి తన పాస్‌పోర్టును ఆంటిగువా ప్రభుత్వానికి అప్పగించి భారత పౌరసత్వం వదులుకున్నాడు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM