పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత

byసూర్య | Mon, Jan 21, 2019, 12:06 PM

న్యూఢిల్లీ : తెలంగాణ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. పంచాయతీ రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM