మెడికల్ కాలేజీ గురించి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు: జగ్గారెడ్డి

byసూర్య | Mon, Jan 21, 2019, 10:48 AM

దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేను మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయింది టీఆర్ఎస్ నుంచేనని చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉందని... అదే విషయంపై అసెంబ్లీలో తాను అడగ్గానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని... ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కాలేజీ ఏర్పాటుపై జీవో వెలువడిన తర్వాత కేసీఆర్ ను కలుస్తానని... సంగారెడ్డికి ఆయనను ఆహ్వానించి ఘనంగా సన్మానిస్తానని తెలిపారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవలంబించిన విజన్ 2020 వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. మెదక్ నుంచి రాహుల్ గాంధీ, కేసీఆర్ లు తలపడితే... రాహుల్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM