నేడు కేసీఆర్ సహస్ర మహా చండీ యాగం

byసూర్య | Mon, Jan 21, 2019, 12:07 AM

 ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి వారి సమక్షంలో ‘‘చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం’’ ప్రారంభం కానున్నది. సహస్ర మహా చండీ యాగం ఉదయం 11.00 నుంచి ప్రారంభం అవుతుంది. 300 మంది రుత్వికులతో జనవరి 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు 5 రోజులపాటు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం జరగనున్నది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రుత్వికులు ఇప్పటికే యాగశాలకు చేరుకున్నారు.ఈ మహా క్రతువు కోసం కర్ణాటక శృంగేరి పీఠం నుంచి వేద పండితులు ఇప్పటికే చేరుకున్నారు. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తారు. ఐదు రోజులపాటు జరగనున్న యాగంలో పాల్గొననున్న కేసీఆర్ దంపతులు యాగశాలలో ఆసీనులవుతారు. ముందుగా గోపూజ చేసిన తరవాత యాగం ప్రారంభం అవుతుంది. ఈనెల 25 వ తేదీన పూర్ణాహుతితో ముగియనున్నది. తెలంగాణాలో సకాలంలో వర్షాలు పడి, రైతులు సుభిక్షంగా ఉండేలా, ఇతర అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరాఘాటంగా కొనసాగేలా, బంగారు తెలంగాణా కల సాకారం అయ్యేలా అమ్మవారి అనుగ్రహం కోసం సహస్ర హోమాలు నిర్వహిస్తున్నారు.


యాగశాలను సందర్శించిన సీఎం కేసీఆర్ : సీఎం కేసీఆర్ ఆదివారం యాగశాలను సందర్శించారు. ఏర్పాట్లను పండితులు, రుత్వికులతో కలిసి చర్చించారు. సోమవారం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఆహ్వానాలు పంపించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM