గవర్నర్‌ ప్రసంగంలో కొత్తగా చెప్పిందేమీ లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి

byసూర్య | Sun, Jan 20, 2019, 12:59 PM

గవర్నర్‌ ప్రసంగంలో కొత్తగా చెప్పిందేమీ లేదని కాంగ్రెస్‌ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాసన సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచబోతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. రైతుబీమా చెల్లింపు దస్త్రాలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వరంగల్‌, ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తేనే రైతులకు మేలు కలుగుతుందన్నారు. రెండు పడకగదుల ఇళ్ల పథకం వల్ల ప్రజలు సొంతింటి కల నెరవేర్చలేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం వల్ల పేదలకు లబ్ధి చేకూరలేదన్నారు. ఇల్లు కాలిపోయిన, కూలిపోయిన బాధితులకు ఈ నాలుగేళ్లలో ఎలాంటి సహాయం అందలేదన్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM