'మూడ్‌'లో ఉన్నాడట..

byసూర్య | Sat, Jan 19, 2019, 07:45 PM

విద్యార్థులకు సెలవులు తీసుకోవడం అంత సమస్య కాదు. కానీ ఉద్యోగిగా మారితే వారికి లీవ్ కష్టాలు తెలుస్తాయి. కొందరు ఉద్యోగులకు తేలికగా సెలవులు దొరుకుతాయి. మరికొందరు ఉద్యోగులు మాత్రం తమ మాటలతో ఉన్నతాధికారులను మెప్పించి ఎలాగోలాగ లీవ్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతుంటారు. పోలీసుశాఖ విషయానికొస్తే ఉద్యోగుల కొరత వల్ల వారు సాధారణ రోజులతో పాటు ప్రత్యేక సందర్భాలలో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అయితే తన సెలవు కోసం లేనిపోని సాకులు చెప్పడం ఇష్టంలేని ఓ కానిస్టేబుల్ బాహాటంగా కారణం చెప్పి 10 రోజులు సెలవు కోరాడు. సెలవులు అడగటం, అనుకున్న రోజు సాధించుకోవడం కొందరు ఉద్యోగులకు తెలిసిన కళ అని సాధారణంగా వింటూనే ఉంటాం. పోలీస్ శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్ అతి తెలివి వాడటంతో లీవ్ లెటర్ వైరల్‌గా మారింది. మారుతీ అనే వ్యక్తి కర్ణాటకలోని బేగూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల మారుతీకి వివాహమైంది. అయితే భార్యతో గడపటానికి తీరిక దొరకడం లేదని సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘నాకు ఇటీవల పెళ్లైంది. కొన్ని ప్రత్యేక పూజలు చేయించాలి. ఊరిలో కొన్ని పనులున్నాయి. కొత్తగా పెళ్లికావడంతో ఆగలేకపోతున్నాను. మూడ్‌లో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకుని 10 రోజులు సెలవు మంజూరు చేయాలని’ కోరుతూ ఇన్‌స్పెక్టర్‌కు లెటర్ రాశాడు. అయితే ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Latest News
 

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM
ఉపాధి హామీ పథకం టీఏ సస్పెండ్ Tue, Apr 23, 2024, 12:31 PM