ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా..

byసూర్య | Sat, Jan 19, 2019, 05:35 PM

సీఎల్పీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుందని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకుడు.. ఆయన్ను సీఎల్పీ గా నియమించి మంచి సందేశం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేతగా భట్టిని నియమించి బడుగు వర్గాలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని సర్వే చెప్పుకొచ్చారు. పీసీసీని కూడా ప్రక్షాళన చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీని బ్రష్టు పట్టించిన ఉత్తమ్ కు సీఎల్పీ ఇవ్వడం అధిష్టానానికి ఇష్టం లేదని తేలిందని, రేపో, మాపో పిసిసి పదవి పోతుందని చెప్పారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ఓటమి తప్పదని, తన ఓటమికి ఆయన కూడా కుట్ర చేశారని సర్వే సత్యనారాయణ ఆరోపించారు. 


Latest News
 

బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM