అక్కసుతో చంద్రబాబు విమర్శలు : కేటీఆర్

byసూర్య | Fri, Jan 18, 2019, 06:07 PM

హైదరాబాద్:  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్కసుతోనే తెరాసపైనా, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పైనా విమర్శలు చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చంద్రబాబు విమర్శలు హద్దులు దాటుతున్నాయని విమర్శించారు. గద్దల్లా ఏపీని తన్నుకుపోవడానికి చూస్తున్నారని చంద్రబాబు అనడాన్ని కేటీఆర్ అన్నారు. మోడీతో నాలుగున్నరేళ్లు సంసారం చేసిన చంద్రబాబు తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి మోడీని బూచిగా చూపుతూ, మేం మోడీతో లాలూచీపడ్డామని చెబుతూ ప్రజలను అయోమయానికి గురి చేద్దామని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అంటే బిల్డప్ జాతీయ పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలలో ఆ పార్టీ 118 స్థానాలలో పోటీ చేస్తే 113 స్థానాలలో డిపాజిట్లు రాలేదని ఆయన చెప్పారు. 


బీజేపీ అభ్యర్థుల కోసం ప్రధాన మంత్రి మోడీ వచ్చారని, ఆరడజను మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేశారని ఆయన అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి నేతృత్వంలోని ఎన్డీయే వంద నూట పది స్థానాలకు మించి వచ్చే అవకాశం లేదని, అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు కూడా వంద స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని శాశించే స్థితిలో మనం ఉండాలని కేటీఆర్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే… ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మనం 16 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని కేటీఆర్ అన్నారు. అలాగే తాను  ఏపీలో విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని కలిశాననీ ఆయన సానుకూలంగా స్పందించారని కేటీఆర్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిసి 43 పార్లమెంటు స్థానాలలో విజయం సాధిస్తే కేంద్రాన్ని శాశించగలమని అన్నారు.


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM