తెరాసలో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డి

byసూర్య | Fri, Jan 18, 2019, 05:25 PM

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. ప్రతాప్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు వంటేరు చెప్పారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరుతారని ఆయన కుమారుడు నిన్నే ప్రకటించారు. అయితే అవన్నీ ఊహాగానాలని, ప్రతాప్‌రెడ్డిని తెరాసలోకి ఎవరూ ఆహ్వానించలేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. పార్టీలోకి ఆయన వచ్చినా రానివ్వబోమని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో తెరాసలో తాను చేరుతున్నట్లు వంటేరు ఈ ఉదయం స్వయంగా ప్రకటించి తాజాగా పార్టీలో చేరారు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM