మా పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేయం: కోదండ‌రామ్‌

byసూర్య | Mon, Jan 14, 2019, 09:24 PM

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారుతెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. సార్వత్రిక ఎన్నికలకు తమ పార్టీ సిద్దంగా ఉన్నామని ప్రకటించిన కోదండరాం తమ పార్టీ ఓటమికి కారణంపార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడంఅని ఆయన వివరించారు. .తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని వస్తున్న వార్తలను ఆయ‌న‌ ఖండించారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ లోనే కాదు మరే ఇతర పార్టీలో విలీనం చేసే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారుకాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పథం ఉన్నంత మాత్రాన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే విషయంపై ఆయ‌న‌ మండిపడ్డారు. ఇక తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశ చెందలేదన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమన్నారు.
ఇక ప్రస్తుత రాజకీయాల పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కోదండరాం గతంలో నమ్మిన సిద్ధాంతాల కోసం పార్టీలో పనిచేసేవారని, ఇంతగా ఫిరాయింపులు ఉండేవి కాదని చెప్పారు. ప్రస్తుతం మాత్రం రాజకీయాల్లో విలువలు పూర్తిగా పోయాయని రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓటమి పైన ఇలాంటి చర్చ జరగలేదని చెప్పిన ఆయన లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం పైన కూడా ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కి సంబంధించి తమకంటూ ఒక వ్యూహం ఉందని దానిని బట్టే తమ ప్రయాణం సాగుతుందని ఆయన తెలిపారు. ఇక పంచాయతీ ఎన్నికల్లోనూ తెలంగాణ జన సమితి కార్యకర్తలు పోటీ చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఒత్తిడితో కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తమ పార్టీ ఏ పార్టీలో విలీనం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ కార్యకర్తలు పోటీ చేస్తారని స్పష్టం చేసిన ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. ఇక పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగా బరిలోకి దిగుతాము అన్నది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన ఆయన టిఆర్ఎస్ రాజకీయ ఒత్తిడితో చాలా గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేస్తుందని ఫైర్ అయ్యారు. అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కోదండరాం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.


 


Latest News
 

బియ్యపు గింజ పై శ్రీరామ నామం Tue, Apr 16, 2024, 11:27 AM
వెండి కిరీటాలు బహుకరణ Tue, Apr 16, 2024, 11:14 AM
టూరిజం కోర్సులకు దరఖాస్తులు Tue, Apr 16, 2024, 10:46 AM
నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి Tue, Apr 16, 2024, 10:44 AM
మనస్తాపంతో బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 10:42 AM