గోల్కొండ లో గౌర‌వ గృహాల నిర్మాణాలు ఆపండి

byసూర్య | Mon, Jan 14, 2019, 04:38 PM

గోల్కొండ కోటను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉండే కోటలో సందర్శకుల కోసం పురాతత్వ శాఖ సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా కోటలో ఇప్పటికే పలు టాయ్‌లెట్‌(గౌరవగృహం)లను నిర్మించింది. అయితే.. బాలహిస్సార్‌లోని దర్బార్‌హాల్‌ ప్రాంతంలో నిర్మించదలచిన టాయ్‌లెట్‌ నిర్మాణంపై పలు సంఘాల  నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్మాణాన్ని ఆపాలని వారు కోరుకుంటున్నారు. ఆదివారం పలు సంఘాల నేతలు గోల్కొండను సందర్శించారు. టాయ్‌లెట్‌ నిర్మాణం కోసం తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. దర్బార్‌ ప్రాంతంలో టాయ్‌లెట్‌ నిర్మాణం చేయడం ఎట్టి పరిస్థితుల్లో సరైన నిర్ణయం కాదని, పురాతన కట్టడాల పరిరక్షణకు వ్యతిరేకమని నగరానికి చెందిన చరిత్రకారుడు మహ్మద్‌ షఫీయుల్లా తెలిపారు. గోల్కొండలో పర్యటించిన సామాజిక కార్యకర్త డాక్టర్‌ లుబ్నాసర్వత్‌ మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన నిర్మాణం పురాతన కట్టడాల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించేలా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. గోల్కొండ కోటపై పెద్ద గుంత తవ్వడం కారణంగా కట్టడం బలహీన పడిందని, కట్టడం కొన్ని చోట్ల పాడైన విషయాన్ని గమనించి కూడా నిర్మాణానికి యత్నించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పురాతన కట్టడాల పరిరక్షణ (ఎడాప్ట్‌ హెరిటేజ్‌)లో భాగంగా గోల్కొండ కోటను జీఎంగ్‌స్పోర్ట్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ దత్తత తీసుకుంది. గోల్కొండ పరిసరాల్లో పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ సంస్థ పురాతత్వ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. వయోజనులు, విదేశీ పర్యాటకుల సౌకర్యం కోసమే టాయ్‌లెట్‌ నిర్మించదలచామని అధికారులు వివరణ ఇచ్చారు.


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM