కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం

byసూర్య | Mon, Jan 14, 2019, 03:07 PM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సమీపంలో పెద్ద ఎత్తున టెంట్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో మంటలు వ్యాపించలేదు. వెంటనే వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతం మొత్తన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. ఎగిసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో ఆ ప్రాంతమంతా కాలిపోయిన వస్తువులు దర్శనమిచ్చాయి. ప్రాంతంలో దుర్వాసన కూడా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఇదిలా ఉంటే మంటల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రయాగా రాజ్ కుంభమేల భద్రతా అధికారి నిర్ధారించారు. ఇదిలా ఉంటే కుంభమేళ జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ప్రయాగరాజ్‌లో ప్రతి ఆరేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అలహాబాదుకు తరలివస్తారు. గంగా యమునా నదుల్లో పవిత్ర స్నానంను భక్తులు ఆచరిస్తారు.


 


 


Latest News
 

ఎమ్మెల్సీ ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 28, 2024, 04:06 PM
పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి Thu, Mar 28, 2024, 04:04 PM
ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం Thu, Mar 28, 2024, 04:02 PM
రుణాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీసీసీబీ డైరెక్టర్ Thu, Mar 28, 2024, 04:01 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయం: ఎమ్మెల్యే మేఘారెడ్డి Thu, Mar 28, 2024, 03:57 PM