నష్టాలతో మొదలైన మార్కెట్లు

byసూర్య | Mon, Jan 14, 2019, 11:06 AM

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో నేడు భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 106 పాయింట్ల నష్టంతో 35,903 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 10,763 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 171 పాయింట్ల నష్టంతో 35,808, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 10,735 వద్ద ట్రేడవుతున్నాయి. షేర్ల బైబ్యాక్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు 2.5శాతం లాభంతో కొనసాగుతోంది. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 70.49గా ఉంది.


అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మరింత మందగిస్తుందని ఆ దేశ ట్రేడ్‌ డేటా వెల్లడిస్తుండటం మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పై కూడా పడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరో పక్క చమురు ధరలు కూడా నిలదొక్కునే అవకాశం ఉంది. ఇప్పటికే చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌, రష్యా నిర్ణయించాయి. మరోపక్క అమెరికాలో కూడా చమురు ఉత్పత్తి తగ్గింది. ఫ్యూచర్స్‌లో బ్రెంట్‌ చమురు పీపా ధర 27 సెంట్లు పెరిగి 60.75 డాలర్లకు చేరింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM