కిక్కిరిసిన జూబ్లీ బస్టాండ్‌...పల్లెకు పోటెత్తిన నగర జనం

byసూర్య | Mon, Jan 14, 2019, 09:38 AM

సంక్రాంతి పండుగను తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్న ప్రయాణికులతో జూబ్లీ బస్‌స్టేషన్‌ ఆ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా పండుగకు తమ ఊళ్లకు వెళ్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ముందుగా అనుకున్నట్లుగానే రద్దీకి అనుగుణంగా కరీంనగర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌ సెక్టార్లలోని వివిధ ప్రాంతాలకు రోజువారి సర్వీసులతోపాటు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సెక్టార్లకు ప్రతిరోజు 1053బస్సులు రాకపోకలు సాగిస్తు సుమారు 50వేలమందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. పండుగ సందర్భంగా రోజువారీ సర్వీసులతోపాటు ఈ నెల 11న కరీంనగర్‌ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాలకు అదనంగా 188, ఆదిలాబాద్‌కు 28, మెదక్‌కు 3, నిజామాబాద్‌ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాలకు 76 మొత్తం 295 అదనపు బస్సులను ఏర్పాటు చేయగా, 12వ తేదీన కరీంనగర్‌కు 204, ఆదిలాబాద్‌కు 96, మెదక్‌కు 162, నిజామాబాద్‌కు 85 మొత్తం 547 అదనపు సర్వీసులను నడిపించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉందని, రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధగా ఉన్నట్లు పికెట్‌ డిపో మేనేజర్‌ ప్రణీత్‌ పేర్కొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM