ఫుల్ స్వింగ్ లో 'OG' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్

by సూర్య | Mon, Sep 08, 2025, 03:04 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ అప్ లో భారీ ప్రాజెక్ట్ ఉన్నాయి. వాటిలో ఒకటి టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'OG'. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
అభిషేక్ బచ్చన్ మేకప్ ఆర్టిస్ట్ మృతి Wed, Nov 12, 2025, 07:58 PM
డిసెంబర్ 31న 'పెద్ది' సెకండ్ సింగిల్ విడుదల Wed, Nov 12, 2025, 07:56 PM
రామ్ చరణ్ నటనపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం Wed, Nov 12, 2025, 07:55 PM
క్షేమంగానే ఉన్నానన్న గోవిందా Wed, Nov 12, 2025, 04:49 PM
'చంద్రముఖి' చిత్రం అప్పుడు అలా జరిగింది Wed, Nov 12, 2025, 04:47 PM