సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సూర్య 46'

by సూర్య | Sat, Jul 19, 2025, 09:00 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని తాత్కాలికంగా 'సూర్య 46' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించింది. ఈ షెడ్యూల్ లో మేకర్స్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసారు. ఈ విన్యాసాలు మొత్తం చిత్రానికి హైలైట్ అవుతాయి అని లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో సూర్యకి జోడిగా మమిత బైజు నటిస్తుంది. ఈ చిత్రానికి GV ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్యదేవర నాగా వంశి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలతో పాటు సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
ప్రేమ, జీవితంపై రెజీనా కాసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Apr 18, 2026, 02:28 PM
క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత Sat, Apr 18, 2026, 12:05 PM
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు.. అదితి పోస్ట్ వైరల్ Sat, Apr 18, 2026, 11:18 AM
ప్రేక్షకుల కోరిక మేరకు 'ఓ అందాల రాక్షసి' రీ-రిలీజ్ Sat, Apr 18, 2026, 10:44 AM
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM