ఇది ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్ సృష్టి

by సూర్య | Sun, Aug 25, 2019, 05:24 PM

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్..ప్రభాస్..  దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు ‘సాహో’ సినిమాతో ఈ నెల 30న మరోసారి దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి వస్తున్నాడు. అయితే తెలుగు నాట ప్రభాస్ అంటే అందరికీ తెలుసు.. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి హిందీలో ఫ్యాన్స్ సంగతేంటి? ఉత్తరాది వారికి ప్రభాస్ పై ఎంత ప్రేమ ఉంది.


తాజాగా ఒడిషాకు చెందిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ సుమిత్ ద్వివేది ప్రభాస్ పై ప్రేమను అద్భుతంగా చూపించాడు. అతడు ప్రభాస్ కోసం ఏకంగా 486 రుబిక్స్ క్యూబ్ లను సేకరించి 13 గంటలు కష్టపడి ప్రభాస్ ముఖం కనిపించేలా వరుసగా గోడకు పేర్చాడు.  ప్రభాస్ సాహో చిత్రం రిలీజ్ సందర్భంగా అతడిపై ప్రేమతో సాహో లుక్ ను రుబిక్స్ క్యూబ్ తో ఇలా తీర్చిదిద్దాడు. ఒడిషాలోని కియోంజర్ కు చెందిన సుబిత్ తాజాగా ప్రభాస్ కోసం  చేసిన ఈ ఫీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభాస్ కు తెలుగు నాటే కాదు.. ఒడిషాలో కూడా ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం ఈ వీడియోతో తేటతెల్లమైంది. 





 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM