మాస్టర్ సూపర్ స్టార్ గౌతమ్..

by సూర్య | Sun, Aug 25, 2019, 02:44 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, అయన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు చేస్తుంటారు. అయితే ఆయన సతీమణి నమ్రత కూడా కూతురు సితార, కుమారుడు గౌతమ్ గురించి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా  ఒక ఫోటో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోకు "మా MUN ప్రతినిథులు..  గౌతమ్ తన బెస్ట్ ఫ్రెండ్ శ్రేయశస్ రెడ్డి తో స్కూల్ లో సండే డిబేట్ కోసం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  MUN అంటే ఏంటో తెలుసా?  మోడల్ యునైటెడ్ నేషన్స్.  అంటే ఐక్య రాజ్యసమితి మోడల్ లో చర్చలు నిర్వహిస్తారన్న మాట. ఈ ఫోటోలో గౌతమ్ తన స్నేహితుడితో కలిసి ఇంటి ముందు నిలుచుని ఫోటోకు పోజిచ్చాడు.  ప్యాంట్ జేబులలో చేతులు పెట్టుకొని స్టైల్ విషయం లో నాన్న మహేష్ బాబును గుర్తు తెస్తున్నాడు.  


ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  గౌతమ్ అచ్చంగా మహేష్ స్టైల్ లో ఉన్నాడని చాలామంది పొగడ్తలు కురిపించారు. మహేష్ పిల్లలలో సితార పాప అల్లరికి పర్మనెంట్ బ్రాండ్ అంబాజిడర్ లా ఉంటే.. గౌతమ్ మాత్రం హంబుల్ నెస్ కు బ్రాండ్ అంబాజిడర్ అనిపిస్తాడు.  మహేష్ క్లోతింగ్ బ్రాండ్ కు గౌతమ్ పర్ఫెక్ట్ మోడల్ గా సెట్ అయ్యేలా ఉన్నాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM