వెంకీ మామకు హగ్ ఇచ్చిన రాశి ఖన్నా

by సూర్య | Sun, Aug 25, 2019, 11:33 AM

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్ర సెట్స్ పై విక్టరీ వెంకటేష్ తో దిగిన ఓ పిక్ అభిమానులతో పంచుకుంది రాశి ఖన్నా. ఇందులో వెంకీని కౌగిలించుకొని కనిపించింది రాశీ. ఈ మేరకు ఫ్యాన్ గర్ల్ అని పేర్కొంటూ వెంకటేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఈ పిక్ చూసి వెంకీ అభిమానులు మురిసిపోతున్నారు. లైకులు, రీ ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాలో నాగ చైతన్య బాగా కష్టాలొస్తాయట. ఆ కష్టాలన్నీ తన మామ వెంకటేష్ వల్లనే ఉత్పన్నమవుతాయట. అయితే వాటి నుంచి బయటపడే క్రమంలో నాగ చైతన్య జ్యోతిష్యుల చుట్టూ తిరగాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశాలతో సినిమా సాగిపోతుందని అంటున్నారు. ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ముల్టీస్టారర్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Latest News
 
ఫ్యామిలీ స్టార్ : నంద నందనా వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 06:40 PM
'హరోమ్ హర' లోని కనులెందుకో సాంగ్ ప్రోమో అవుట్ Tue, Apr 23, 2024, 06:38 PM
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM