శాటిలైట్ భాగస్వామిని ఖరారు చేసిన 'విశ్వంబర'

by సూర్య | Wed, Jun 18, 2025, 02:16 PM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అభిమానులు ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. UV క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM