దటీజ్ సూర్యకాంతం..!

by సూర్య | Fri, Aug 23, 2019, 10:41 PM

సూర్యకాంతం అంటే ట‌క్కున గుర్తొచ్చేది ఆమె చేసిన గ‌య్యాళి పాత్ర‌లే. వెండితెర‌పై ఎంత చిట‌ప‌ట‌లాడిపోయేవారో.. తెర‌వెనుక అంత నిర్మ‌ల హృద‌యంతో ఉండేవారు. సెట్‌లో ఆమె ఉంటే ఆ సంద‌డేవేరు. అందుకే ఆమెను స‌ర‌దాగా ‘స‌న్‌షైన్’ అనిపిలిచేవార‌ట‌. 
ఎందుకంటే షూటింగ్ సూర్య‌కాంతితో వెలిగిపోతుంద‌ని అలా అనేవార‌ట‌. ఇక ఆమె షూటింగ్ స‌మ‌యంలో చేసే అల్ల‌రి ఇంతా అంతా కాదు. ఒక సినిమాలో పెళ్లి సీను తీస్తున్నారు. ఆ పెళ్లి తంతు జ‌రిపించ‌డానికి రావాల్సిన పురోహితుడు త‌న స‌హాయ‌కుడిని పంపాడు. రిహార్స‌ల్సులో అత‌డు త‌డ‌బ‌డ్డాడు. అక్కడే ఉన్న సూర్యకాంతం అత‌ని గురించి అడిగితే, పురోహితుడికి అసిస్టెంట్‌న‌ని చెప్పాడు. 
‘‘ఆహా! అవునా నాయ‌నా అందుకే ‘మాంగ‌ల్యం తెంతునానేనా’ అంటున్నావు. క‌ట్టకముందే తెంచేయ‌కు నాయ‌నా.. ప్లగ్‌ ఊడిపోగ‌ల‌దు’’ అని ఆట ప‌ట్టించారు. ‘ప్లగ్‌ ఏమిట‌మ్మా’ అని అడిగితే ‘త‌న వెన‌కాల చిన్న ముడి ఉంది క‌దా- అదే ప్లగ్‌‌’ అని ఆవిడ అన‌డంతో అక్క‌డ ఉన్న వారంద‌రూ ఒక్కసారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.





Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM