గ్యాంగ్‌ లీడర్‌ మళ్లీ మొదలవుతుంది

by సూర్య | Fri, Aug 23, 2019, 08:29 PM


మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌ లీడర్‌. మళ్లీ మొదలవుతుంది రచ్చ అనేది ఉప శీర్షిక. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు సిహెచ్‌.రవికిషోర్‌ బాబు మాట్లాడుతూ షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. చిరంజీవిగారి సూపర్‌హిట్‌ సినిమా టైటిల్‌ సినిమా కావడం వల్ల ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా తీస్తున్నాం. చిరంజీవి అభిమానులకు ప్రేక్షకులకు మెచ్చే విధంగా సినిమా ఉంటుంది అని చెప్పారు. హీరో మోహనకృష్ణ మాట్లాడుతూ మోగాస్టార్‌ అభిమానిని ఆయిన నేను ఆయన సూపర్‌హిట్‌ సినిమా టైటిల్‌తో తీస్తున్న చిత్రం అందరినీ అలరించే విధంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రంలో ఇంకా సుమన్‌, తనికెళ్ల భరణి, మహేష్‌, చిత్రం శ్రీను, ఎల్‌బి.శ్రీరామ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి, ఛాయాగ్రహణం: శివ.


 


 


 



Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM