అన్నయ్య విషయంలో అదే నాకు అసంతృప్తి: నాగబాబు

by సూర్య | Fri, Aug 23, 2019, 08:25 PM

‘‘అన్నయ్యగారి పుట్టినరోజు సందర్భంగా చాలా రోజుల తర్వాత మళ్లీ మాట్లాడుతున్నా. చిన్నప్పటి నుంచి మా అందరి బర్త్‌డేల కన్నా అన్నయ్య బర్త్‌డే చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే అన్నయ్య పుట్టినరోజును అమ్మ బాగా చేసేది. నాకైతే ఇంట్లో వాళ్ల ఎవరి పుట్టినరోజులు గుర్తుండవు. అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత బర్త్‌డే రోజును మెగాఫ్యాన్స్‌ డేగా పరిగణిస్తున్నాం. మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. సమాజంలో వివిధ రంగాల్లో ప్రాచుర్యం పొందిన వారిని సన్మానిస్తున్నాం. రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాం.  ఫారెన్‌ వెళ్లడంతో తాజాగా నిర్వహించిన అన్నయ్య పుట్టినరోజు వేడుకకు నేను వెళ్లలేకపోయా. మా ఇంట్లో నాన్నగారి తర్వాత అంత గౌరవం ఇచ్చేది అన్నయ్యకే. ఆయన, మా వదిన కూడా మమ్మల్ని చాలా కేరింగ్‌గా చూసుకుంటారు. అన్నయ్య వల్లే మేమంతా కలిసి ఉంటున్నాం. బాధ్యతలు ఎలా తీసుకోవాలో నేర్పారు. అవసరమైనప్పుడు అడగకపోతే తిడతాడు తప్ప.. అస్సలు విసుక్కోడు. సంతోషంతో ఆ పని చేసిపెడతాడు.’’
ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసిన చిరంజీవికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగబాబు అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు.

Latest News
 
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 02:41 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Apr 24, 2024, 02:38 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'జయ జానకి నాయక' Wed, Apr 24, 2024, 02:35 PM
ఓపెన్ అయ్యిన 'రత్నం' బుకింగ్స్ Wed, Apr 24, 2024, 02:27 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Wed, Apr 24, 2024, 02:25 PM