సాహో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్

by సూర్య | Fri, Aug 23, 2019, 07:28 PM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా బాహుబలి 2 రేంజ్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్ హీరో అయిపోతాడు. ఈ సమయంలో వచ్చిన ఒక న్యూస్ అభిమానులను కలవర పెడుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు చెందిన తెలుగు, తమిళ, మలయాళం డిజిటల్ రైట్స్ ను 42 కోట్లకు దక్కించుకుందట. ఇది కానీ వినీ ఎరుగని రేటు సహజంగా అభిమానులు ఇటువంటి వార్తను హర్షిస్తారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం దిగాలుగా ఉన్నారు. కారణం అమెజాన్ ప్రైమ్ సినిమాలను నెల రోజుల లోపే ప్రసారం చేసేస్తోంది. అమెజాన్ ప్రైమ్ సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే మొన్న ఆ మధ్య మహేష్ బాబు మహర్షి నిర్మాతలు తమ సినిమాను 50 రోజుల వరకు ప్రసారం కాకుండా ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు. దానివల్ల సినిమా లాంగ్ రన్ అనేది ఏ మాత్రం ప్రభావితం కాలేదు. సాహూ నిర్మాతలు ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది తెలీదు. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం గనుక బాలీవుడ్ లో విజయవంతమైతే తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ స్థాయిలో పెరిగిపోవడం ఖాయం.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM