చిరు నాకు ఒక్క రూపాయి ఇవ్వకున్నా పర్లేదు : మణిశర్మ

by సూర్య | Fri, Aug 23, 2019, 01:20 PM

మెగాస్టార్‌ చిరంజీవి కామెడీ చేశారంటే.. ‘హాస్యబ్రహ్మ’ బ్రహ్మానందం కూడా తట్టుకోలేరని అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. చిరు గురించి మాట్లాడుతూ మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో అన్న మాటిది. మణిశర్మ-చిరు కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. తనకు చిరు అన్నయ్యలాంటివారంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


‘అన్నయ్య సినిమాకు సంగీతం అందించాల్సి వస్తే నాకు తెలిసిన బీట్స్‌ అన్నీ వాడేస్తాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఏది బెస్ట్‌ సినిమా అని చెప్పలేను. అసలు ఆ ప్రశ్న కూడా వృథానే. చెప్పాలంటే అన్నయ్య కామెడీ బాగా చేస్తారు. ఆయనలోని పూర్తి కామెడీ కోణాన్ని ప్రేక్షకులు చూడలేదు. అన్నయ్య కామెడీ చేస్తే బ్రహ్మానందం కూడా తట్టుకోలేరు. చిరు నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా ఆయనతో సినిమా చేయడానికి నేను రెడీ. కావాలంటే నా ఆర్కెస్ట్రాకు ఇవ్వాల్సిన ఖర్చులన్నీ నేనే భరిస్తా. అంతేకాదు సినిమా రిలీజ్‌ వేడుక కూడా నేనే ఏర్పాటుచేస్తా. నా జీవితంలో కేవలం ఇద్దరు వ్యక్తులనే నేను అన్నయ్య అని పిలుస్తాను. వారిలో ఒకరు చిరంజీవి’ అని చెప్పుకొచ్చారు మణిశర్మ.

Latest News
 
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM