ఏదైనా జరగొచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్

by సూర్య | Wed, Aug 21, 2019, 05:21 PM


శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయం అవుతూ పూజా సొలంకీ, సాషా సింగ్‌ హీరోయిన్లుగా రమాకాంత్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఏదైనా జరగొచ్చు. వెబ్‌బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై సుదర్శన్‌ హనగోడు నిర్మిస్తున్నారు. తమిళస్టార్‌ బాబి సింహా నెగిటివ్‌ రోల్‌లో కన్పించ నున్నారు. వైనత్యానంద్‌ కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్‌ అల్లుడు రవి శివతేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 23న చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు శివాజీరాజా మాట్లాడుతూ దర్శకుడే సినిమాకు ప్రాణం అన్నారు. అలాగే ఈ సినిమా కూడా రమాకాంత్‌దే అని అన్నారు. మ్యూజిక్‌ చాలా బాగుందని, నటీనటులు టెక్నీషియన్లు అందరికి బెస్ట్‌ విషెస్‌ అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌ పెండ్యాల, బాబీసింహ, దర్శకుడు కె.రమాకాంత్‌, హీరో విజయ్‌ రాజా, కో ప్రొడ్యూసర్‌ సుదర్శన్‌ హనగోడు తదితరులు మాట్లాడారు.


 


 


 



Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM