లాయర్ పాత్రలో జగ్గు భాయ్

by సూర్య | Tue, Aug 20, 2019, 10:24 PM

సెకండ్ ఇన్నింగ్స్ ఏ ముహూర్తాన  మొదలుపెట్టాడో కానీ అప్పటి నుంచి నటుడు జగపతిబాబుకు తిరుగు లేకుండా పోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో హయ్యెస్ట్ పెయిడ్ విలన్ ఎవరంటే  మరో పేరు వినిపించడం లేదు. అందులోనూ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే జగ్గు భాయ్ డేట్స్ దొరకడం కూడా అంత ఈజీగా లేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఇంత టైట్ షెడ్యూల్ లోనూ జగపతిబాబు ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నట్టు టాక్. గతంలోనూ అమెజాన్ ప్రైమ్ నిర్మించిన గ్యాంగ్ స్టార్స్ లో నటించిన జగ్గు అందులో బాగానే రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడిది రెండోది. ట్విస్ట్ ఏంటంటే ఇందులో జగపతి బాబు పోషించే పాత్ర లాయర్ అట. అందులోనూ అమ్మాయిలను మహిళలను విపరీతమైన కామదృష్టితో చూసే పేరు మోసిన న్యాయవాదిగా చాలా డిఫరెంట్ గా ఈ రోల్ ఉంటుందట దీనికి దర్శకుడు.. మెహెర్ రమేష్ అని సమాచారం.  ఇప్పుడీ వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM