గాయనీగాయకులకు సినిమానే గమ్యం కాకూడదు : ఎస్పీ బాలు

by సూర్య | Tue, Aug 20, 2019, 10:17 PM

ప్రస్తుతం సినిమా పాటలు వెర్రితలలు వేస్తున్నాయని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. గాయకులు కావాలనుకునే వారికి ఈటీవీలో ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా’ వేదిక ఒక కార్యశాల వంటిదని చెప్పారు. ప్రముఖ గాయకులు ఏసుదాసు, చిత్రతో కలిసి నవంబర్ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మైదానంలో భారీ సంగీత విభావరి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో తన కుమారుడు చరణ్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాయనీగాయకులకు సినిమానే గమ్యం కాకూడదన్నారు. నేటి తరం గాయనీ గాయకులకు ప్రతిభ ఉన్నప్పటికీ వృత్తిపరంగా నిలదొక్కుకోవడం ప్రశ్నార్థకరంగా మారుతోందని చెప్పారు. తెలుగులో తొలిసారిగా చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. పూర్తి వాణిజ్య విలువలతో కూడిన పాటలను శ్రోతలకు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలు వివరించారు.  

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM