టాలీవుడ్ లో ఒకే రోజు పది సినిమాలు విడుదల

by సూర్య | Tue, Aug 20, 2019, 05:35 PM

టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కావడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం సినిమా విడుదల అయితే వీకెండ్ లో థియేటర్లు ప్రేక్షకులతో నిండి..కలెక్షన్లు కూడా రాబటోచ్చని నిర్మాతల నమ్మకం. ఇలానే ప్రతి శుక్రవారం సినిమాలు విడుదల అవడం సాధారణమే. ఇక వారానికి రెండు నుండు నాలుగు చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక పెద్ద హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వెనక్కు తగ్గడం ఖాయం. కాగా ఈ శుక్రవారం (ఆగస్టు 23) టాలీవుడ్ లో ఏకంగా పది సినిమాలు విడుదల అవుతుండడం విశేషం. ఆగస్టు 30న ప్రభాస్ సాహో వస్తుండడంతో ఈ చిన్న సినిమాలన్నీ వారం రోజుల ముందే సందడి చేయనున్నాయి. టాలీవుడ్ లో ఒకే రోజు పది సినిమాలు విడుదల అవుతుండడం ఓ రికార్డే. అయితే వీటిలో ఎన్ని ప్రజాదరణకు నోచుకుంటాయన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. 
ఇక ఆగస్టు 23న విడుదల కానున్న సినిమాలు ఇవే..


* కౌసల్య కృష్ణమూర్తి, * నేనే కేడీ నెం.1 * జిందా గ్యాంగ్, * నీతోనే హాయ్ హాయ్, * ఏదైనా జరగొచ్చు, * బాయ్, * ఉండిపోరాదే, * కనులు కనులు దోచెనే, * నివాసి, * హవా , 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM