"సాహో" లో ప్రభాస్ ద్విపాత్రాభినయం ?

by సూర్య | Tue, Aug 20, 2019, 03:22 PM

సాహో రిలీజ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే సమయముంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఈ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. సాహోలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్‌ చాలా కాలంగా వినిపిస్తోంది.


అయితే పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ల రిలీజ్‌ తరువాత ఆ టాక్‌ మరింత బలపడింది. ప్రభాస్‌ రెండు రకాల హెయిర్‌ స్టైయిల్స్‌తో కనిపిస్తుండటంతో సినిమాలో ప్రభాస్‌ అండర్‌కవర్‌ పోలీస్‌గా, దొంగగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిసన్న ఈ సినిమాను సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM