సినిమా పేరు చెప్పిందని చిత్ర యూనిట్ ఆగ్రహం

by సూర్య | Tue, Aug 20, 2019, 03:02 PM

చిత్ర బృందం అనుమతి లేకుండా సినిమా పేరును ప్రకటించడంతో నటి రష్మికపై సదరు యూనిట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గీత గోవిందం’ తెలుగు చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న నటి రష్మిక. ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మళ్లీ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. విజయ్‌ సరసన కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాణంలో ఇంకా పేరుపెట్టని ఓ చిత్రంలో నటిస్తోంది రష్మిక. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నెపోలియన్‌, యోగిబాబు, సతీష్‌, మలయాళ నటుడు లాల్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను త్వరలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని అనుకుంది. అయితే ఉన్నట్టుండి నటి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘సుల్తాన్‌’ సినిమా చిత్రీకరణలో నాలుగోరోజు’ అంటూ ఓ ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా ఇలా చెప్పడంతో బృందం తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM