నానితో హను రాఘవపూడి సినిమా?

by సూర్య | Mon, Aug 19, 2019, 06:54 PM

హను రాఘవపూడి పేరు వినగానే నాని హీరోగా ఆయన తెరకెక్కించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' గుర్తుకు వస్తుంది. అంతగా ఈ సినిమా దర్శకుడిగా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆయన చేసిన 'లై' .. 'పడి పడి లేచే మనసు' చిత్రాలు రెండూ అంతగా ఆదరణ పొందలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను నానీకి వినిపించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన 'వి' సినిమాను పూర్తి చేయవలసి వుంది. ఈ సినిమాల తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళతాడా లేదా అనేది చూడాలి.

Latest News
 
125 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకున్న 'టిల్లు స్క్వేర్' Tue, Apr 16, 2024, 05:41 PM
OTT : ఒక ట్విస్ట్‌తో డిజిటల్ డెబ్యూ తేదీని లాక్ చేసిన గాడ్జిల్లా మైనస్ వన్ Tue, Apr 16, 2024, 05:39 PM
'ఆ ఒక్కటి అడక్కు' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Tue, Apr 16, 2024, 05:31 PM
ఈ నాలుగు తెలుగు బిగ్గీలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని Tue, Apr 16, 2024, 05:29 PM
60M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'చారి 111' Tue, Apr 16, 2024, 05:21 PM