యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'జూనియర్' ఫస్ట్ సింగల్

by సూర్య | Fri, May 23, 2025, 04:41 PM

ప్రముఖ రాజకీయ నాయకుడు జానార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'జూనియర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీలీల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవలే చిత్ర బృందం ఈ  సినిమాలోని ఫస్ట్ సింగల్ ని లెట్స్ లైవ్ థిస్ మూమెంట్ అనే టైటిల్ తో విడుదల చేసింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ ట్రాక్ కి జాస్ప్రీత్ జాస్జ్ తన గాత్రాణి అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ గత నాలుగు రోజులుగా యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో జెనీలియా, రవిచంద్రన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక వారాహి చలానా చిత్రం బ్యానర్ ఆధ్వర్యంలో రజనీ కొర్రపాటి  నిర్మించిన ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 18, 2025న విడుదల కానుంది.

Latest News
 
ఒక ట్విస్ట్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'సిస్టర్ మిడ్నైట్' Wed, Jun 18, 2025, 08:04 AM
ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో 'ఎలెవెన్' Wed, Jun 18, 2025, 07:59 AM
150M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'అనగనగా' Wed, Jun 18, 2025, 07:55 AM
ఆహా లో త్వరలో ప్రసారం కానున్న 'అలపుజా జింఖానా' Wed, Jun 18, 2025, 07:52 AM
'కుబేర' అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ స్పందన Wed, Jun 18, 2025, 07:47 AM