మంచు విష్ణుకి సోదరిగా ‘కాజల్’

by సూర్య | Sat, Aug 17, 2019, 12:02 PM

నటి  కాజల్‌ .. మంచు విష్ణుకు సోదరిగా మారింది. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్‌లో విష్ణుతో కలిసి స్నాక్స్‌ తింటున్న ఫొటోను రక్షాబంధన్‌ సందర్భంగా కాజల్‌ ట్విటర్‌లో షేర్‌  చేసింది. ‘హ్యాపీ రాఖీ అర్జున్‌’ అని  మంచు విష్ణును ట్యాగ్‌ చేశారు. దీనికి ఆయన ప్రతి స్పందించాడు. ‘హాహాహా.. థాంక్స్‌ అను. చేతుల్లో ఫుడ్‌ లేకుండా మనం కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదనుకుంటా’ అంటూ కాజల్‌ను ట్యాగ్‌ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాలో విష్ణు అర్జున్‌ పాత్రలో, కాజల్‌ అను పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఇటీవల మంచు విష్ణు ట్వీట్‌ చేశాడు. అందులో ఒకటి వెబ్‌సిరీస్‌ అని, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. వెబ్‌సిరీస్‌ షూటింగ్‌కు మోహన్‌బాబు క్లాప్‌ కొట్టిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. అయితే కాజల్‌తో ప్రాజెక్టు వివరాల్ని విష్ణు వెల్లడించలేదు.


 


 

Latest News
 
'కృష్ణమ్మ' విజయవాడ ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ Thu, Apr 25, 2024, 02:27 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 02:25 PM
'రత్నం' సింగల్ షాట్ మేకింగ్ వీడియో రిలీజ్ కి టైమ్ లాక్ Thu, Apr 25, 2024, 02:22 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM