''ఆంధ్ర కింగ్ తాలూకా'' టైటిల్ గ్లింప్సెకి సాలిడ్ రెస్పాన్స్

by సూర్య | Mon, May 19, 2025, 08:17 AM

టాలీవుడ్ యువ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబుతో కలిసి ''ఆంధ్ర కింగ్ తాలూకా'' చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్సె ని నటుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ టైటిల్ గ్లింప్సె గత మూడు రోజులుగా యూట్యూబ్ లో ట్రేండింగ్ టాప్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. భగ్యాశ్రీ బోర్స్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతరలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మార్విన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఒక ట్విస్ట్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'సిస్టర్ మిడ్నైట్' Wed, Jun 18, 2025, 08:04 AM
ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో 'ఎలెవెన్' Wed, Jun 18, 2025, 07:59 AM
150M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'అనగనగా' Wed, Jun 18, 2025, 07:55 AM
ఆహా లో త్వరలో ప్రసారం కానున్న 'అలపుజా జింఖానా' Wed, Jun 18, 2025, 07:52 AM
'కుబేర' అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ స్పందన Wed, Jun 18, 2025, 07:47 AM