$550K మార్క్ కి చేరుకున్న '#సింగిల్' USA ప్రీమియర్ గ్రాస్

by సూర్య | Fri, May 16, 2025, 12:22 PM

కార్తీక్ రాజు దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన '#సింగిల్' చిత్రం భారీ అంచనాల మధ్య మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాని USAలో రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ V సినిమాస్ విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా  యొక్క USA ప్రీమియర్ గ్రాస్ $550K మార్క్ కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్‌గా ఆర్ వెల్రాజ్, ఎడిటర్‌గా ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్‌గా చంద్రిక ఉన్నారు. కల్యా ఫిలిం సహకారంతో నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పించారు. కేతిక శర్మ మరియు ఇవానా ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెలా కిషోర్, ప్రభాస్ శ్రీను, గణేష్, రాజేంద్ర ప్రసాద్, సీత ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మానస చౌదరి మరియు రెబ మోనికా మరియు నార్నె నితిన్ అతిధి పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేశారు.

Latest News
 
థ్రిల్ రైడ్ గా ఉండనున్న 'పెద్ది' ట్రైన్ సీక్వెన్స్ Wed, Jun 18, 2025, 07:21 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Jun 18, 2025, 07:14 AM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Wed, Jun 18, 2025, 07:10 AM
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jun 17, 2025, 09:21 PM
మళ్లీ బిడ్డ పుట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పోస్ట్ Tue, Jun 17, 2025, 09:12 PM