బన్నీ-త్రివిక్రమ్‌ సినిమాకు ఆసక్తికర టైటిల్‌

by సూర్య | Thu, Aug 15, 2019, 11:39 AM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు (గురువారం) సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.


ఈ సినిమాకు `అల వైకుంఠపురములో..` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ విజువల్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. `అంత గ్యాప్ ఇచ్చావేంట్రా` అని మురళీ శర్మ అడిగితే.. `ఇవ్వలేదు.. వచ్చింది` అని బన్నీ చెప్పడం బాగుంది. `నా పేరు సూర్య` తర్వాత బన్నీ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ డైలాగ్ బన్నీ అభిమానులను ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM