అల్లు అర్జున్ సినిమాలో మెగా వారసురాలు

by సూర్య | Wed, Aug 14, 2019, 09:02 PM

సినిమాల్లో నటించాలనే ఆసక్తి తో  మెగాఫ్యామిలీ ముద్దుల వారసురాలు నిహారిక వెబ్ సిరీస్ లతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తరువాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. జాగ్రత్తగా ఎంపిక చేసిన సినిమాల్లో మాత్రమే నటించగలిగారు. మూడు సినిమాల్లో నటించినా అవి ఆమెకు అంతగా బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పుడు బన్నీ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందనేది ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు కానుంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకి నిహారిక అయితే బావుంటుందని సుకుమార్ అనుకున్నారట. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పి.. నిహారికను ఒప్పించమని కోరారట. దాంతో అల్లు అర్జున్ ఆమెను ఈ సినిమాలో చేయడానికి ఒప్పించారని చెబుతున్నారు. ఈ సినిమాలో నిహారిక పాత్రకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుందని సమాచారం. 


 

Latest News
 
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM
త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్' టీజర్ Wed, Apr 24, 2024, 05:06 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Wed, Apr 24, 2024, 05:04 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Apr 24, 2024, 04:38 PM
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM