'థగ్ లైఫ్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Thu, May 15, 2025, 09:06 AM

ప్రముఖ నటుడు కమల్ హాసన్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' కి మణి రత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని మే 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సిలంబరసన్ టిఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా, త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో శింబు, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, నాజర్, ఢిల్లీ గణేష్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, జోజు జార్జ్, జిషు సేన్‌గుప్తా, రోహిత్ సరాఫ్, వైయాపురి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా రవి కె చంద్రన్, ఎడిటర్‌గా ఎ శ్రీకర్ ప్రసాద్ మరియు యాక్షన్ కొరియోగ్రఫీని అన్బరివు ద్వయం నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. మద్రాస్ టాకీస్ మరియు ఆర్‌కెఎఫ్‌ఐ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.

Latest News
 
వృద్ధాశ్రమంలో పాకీజా, ఆదుకోవాలని వేడుక Sat, Dec 13, 2025, 11:36 AM
చైతూతో వైవాహిక జీవితంపై శోభితా ఎమోషనల్ Sat, Dec 13, 2025, 10:48 AM
ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి: ప్రభాస్ సినిమాపై దర్శకుడు మారుతి Sat, Dec 13, 2025, 10:47 AM
‘నరసింహ’ చిత్రానికి సీక్వెల్‌ వస్తదంటున్న రజనీకాంత్ Sat, Dec 13, 2025, 10:15 AM
హిందీ బిగ్‌బాస్ లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా Sat, Dec 13, 2025, 10:14 AM