'SSMB29' విక్రమ్ కీలక పాత్ర?

by సూర్య | Wed, May 14, 2025, 07:33 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌలితో కలిసి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB 29' అనే పేరు పెట్టారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దేవా కట్ట డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.

Latest News
 
ప్రేమ, జీవితంపై రెజీనా కాసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు Sat, Apr 18, 2026, 02:28 PM
క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత Sat, Apr 18, 2026, 12:05 PM
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు.. అదితి పోస్ట్ వైరల్ Sat, Apr 18, 2026, 11:18 AM
ప్రేక్షకుల కోరిక మేరకు 'ఓ అందాల రాక్షసి' రీ-రిలీజ్ Sat, Apr 18, 2026, 10:44 AM
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM