![]() |
![]() |
by సూర్య | Wed, May 14, 2025, 07:21 PM
సైలేష్ కోలాను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' మే 1న విడుదల అయ్యింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల అయ్యిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ A- రేటెడ్ క్రైమ్ డ్రామా ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ విడుదల చేస్తుంది. ఈ చిత్రం నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద ఇటీవలే 2 మిలియన్ క్లబ్‌లోకి ప్రవేశించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ గ్రాస్ $2.3M కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హిట్ ఫిల్మ్ యొక్క సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల, సను జాన్ వర్గీస్ కెమెరాను క్రాంక్ చేస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమ్స్ ప్రొడక్షన్స్ కింద ప్రశాంతి టిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Latest News