విడుదల తేదీని లాక్ చేసిన 'గగన్ మార్గన్‌'

by సూర్య | Wed, May 14, 2025, 07:17 PM

కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ గ'గన్ మార్గన్‌' తో ప్రేక్షకులను ఆకర్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. హత్య మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి  ప్రశంసలు పొందిన ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అజయ్ ధిషన్ నటిస్తున్నారు. ఈ ఉత్తేజకరమైన వెంచర్‌లో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు ఎవరు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్వహిస్తుండగా, యువా ఎస్ కెమెరా మరియు రాజా ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ క్రింద ఈ సినిమా నిర్మించబడింది. 

Latest News
 
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM
'ఆంధ్రుల అన్నపూర్ణ డోక్కా సీతమ్మ' ఆన్ బోర్డులో కేశావి Sat, Jun 14, 2025, 05:11 PM
నేడు విడుదలకి సిద్ధంగా ఉన్న 'కుబేర' ట్రైలర్ Sat, Jun 14, 2025, 05:06 PM
నేడే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్ Sat, Jun 14, 2025, 04:53 PM