క్లాసికల్ డాన్సర్ గా రౌడీ బేబీ

by సూర్య | Wed, Aug 14, 2019, 02:38 PM

తన నటనతో యువత మనసుదోచిన సాయి పల్లవి తన నెక్స్ట్ మూవీలో క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుంది. ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కథలను ఎంచుకోవడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. కథతో సహజత్వాన్ని కలిపి నడిపించే ఆయన, తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో వున్నాడు. నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో ఒక సినిమాను రూపొందించడానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు చేసుకుంటున్నాడు.


ఈ సినిమాలో సాయిపల్లవి క్లాసికల్ డాన్సర్ గా కనిపిస్తుందట. కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. చైతూ కెరియర్లోను ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తొలి షెడ్యూల్లో చైతూ .. సాయిపల్లవి కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. డిసెంబర్ నాటికి ఈ సినిమాను షూటింగును పూర్తిచేసి, వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయనున్నట్టుగా సమాచారం. 

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM