ఆ వార్తలు నిజం కాదు : కాజల్

by సూర్య | Wed, Aug 14, 2019, 12:05 PM

గత కొన్ని రోజులుగా 'భారతీయుడి2' సినిమా నుండి కాజల్ తప్పుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, ఎట్టి పరిస్థితుల్లో నూ కమల్‌ సినిమా నుంచి వైదొలగనని అగ్ర కథానాయిక కాజల్‌ చెప్పారు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌కు జోడీగా ఆమె నటిస్తున్న చిత్రమిది. శంకర్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 1996 హిట్‌ ‘భారతీయుడు’కు సీక్వెల్‌ ఇది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. 


అనంతరం తన తర్వాతి సినిమా ‘రణరంగం’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మొత్తం నేను కనిపిస్తానని మీరు ఆశించొద్దు. సినిమాలోని ఓ పాత్ర మాత్రమే నాది. దానికి కథలో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. దర్శకుడు సుధీర్‌ వర్మ నాకు కథ చెబుతున్నప్పుడు నా పాత్రపై చాలా స్పష్టత ఏర్పడింది. ఈ సినిమాలో నేను నటించాలనే ఉద్దేశంతో ఒప్పుకొన్నాను’ అని ఆమె అన్నారు. ‘రణరంగం’లో శర్వానంద్‌ కథానాయకుడిగా నటించారు. కల్యాణి ప్రియదర్శన్‌ మరో కథానాయిక. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM