నా నెక్స్ట్ మూవీతో ట్రెండ్ క్రియేట్ చేస్తా : అనసూయ

by సూర్య | Wed, Aug 14, 2019, 11:51 AM

ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున ముఖ్యమైన పాత్రలకి ఓకే చెబుతూనే, మరో వైపున నాయిక ప్రాధాన్యత కలిగిన కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. అలా ఇటీవల ఆమె చేసిన 'కథనం' సినిమా ఆదరణ పొందలేదు. అయితే ఈ సారి తను చేయనున్న సినిమా మాత్రం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని అనసూయ చెప్పింది. తను ఓకే చెప్పిన కథ ఎంతో విభిన్నంగా ఉంటుందనీ, తన పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని అంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనీ, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అంది. 'కథనం'తో అభిమానులను నిరాశ పరిచిన అనసూయ, తాజాగా ఈ ప్రకటనతో అందరిలోను ఆసక్తిని పెంచేసింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM