![]() |
![]() |
by సూర్య | Sat, May 10, 2025, 06:08 PM
నటుడిగా మరియు నిర్మాతగా నేచురల్ స్టార్ నాని మరోసారి 'హిట్ 3' తో హిట్ ని అందుకున్నారు. సైలేష్ కోలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టిని మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామాలోని ప్రేమ వెల్లువ వీడియో సాంగ్ ని మేకర్స్ విడుదల చేసినట్లు ప్రకటించారు. మిక్కీ జె మేయర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ మరియు నూతన మోహన్ గాత్రాలని అందించారు. హిట్ ఫిల్మ్ యొక్క సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. సాంకేతిక బృందంలో ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల, సను జాన్ వర్గీస్ కెమెరాను క్రాంక్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమ్స్ ప్రొడక్షన్స్ కింద ప్రశాంతి టిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News